Chandrababu : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయబోతున్నారా…? కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారా…? అయితే టిడిపి వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే చెప్పాలి.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం తో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేసేందుకు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని కూడా ఎంచుకొని పెట్టుకున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. తాను ఏ నియోజకవర్గం లో నిలబడితే గెలుస్తాడో అనే విషయాన్ని తెలుసుకునేందుకు మూడుసార్లు సర్వే కూడా చేయించాడట. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత టెన్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎలక్షన్స్ లో ఎప్పుడూ కూడా ఏ నియోజకవర్గంలో ఎవరిని దింపాలి అని ఆలోచించే చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం తనకు సురక్షితమైన నియోజకవర్గం ఏంటి అనేదానిపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇంతలా టెన్షన్ పడటం ఎప్పుడూ చూడలేదని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. నిజానికి కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు దాదాపు ఏడుసార్లు గెలవడం జరిగింది.