Hunger is the weapon: ఆకలే ఆయుధం

  • ఇజ్రాయెల్‌ తీరుపై ఐరాస ఆందోళన

Hunger is the weapon: యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు సహాయంపై ఇజ్రాయెల్‌ విధించిన తీవ్రమైన ఆంక్షలు, సెనిక దాడి పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పౌరుల ఆకలిని ఇజ్రాయెల్‌ ఇక్కడ ఆయుధంగా వాడుతోందని, దీనిని యుద్ధ నేరంగా పరిగణించాల్సి ఉంటుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి మానవ #హక్కుల చీఫ్‌ వోల్కర్‌ టర్క్‌ గాజాలో విపరీతమైన ఆకలి, కరువు పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేశారు.

Hunger is the weapon: ఆకలే ఆయుధం
Hunger is the weapon: ఆకలే ఆయుధం

మానవతా సహాయం, వాణిజ్య వస్తువుల సరఫరా, పంపిణీపై ఇజ్రాయెల్‌ విధించిన విస్తృత ఆంక్షల ఫలితంగా దుర్బిక్షం నెలకొంది. ఫలితంగా జనాభాలో ఎక్కువ మంది వలసవెళ్తున్నారు. గాజాలో కొనసాగుతున్న ఆంక్షల పరిధి, శత్రుత్వాలను కొనసాగించే విధానంతో పాటు, ఆకలిని యుద్ధతంత్రంగా ఉపయోగించడం దురదృష్టకరం.

ఒకవేళ ఇదే నిజమని నిర్ధారణ అయితే యుద్ధ నేరంగా పరిగణిస్తాం. ఆకలిని యుద్ధ ఆయుధంగా ఉపయోగిస్తున్నారా లేదా అన్న దానిపై కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై #హమాస్‌ దాడి చేసినప్పటి నుండి జరిగిన వినాశకరమైన యుద్ధం దాదాపు సగం మంది గాజా పౌరుల జీవితాలను ఛిత్రం చేసింది. 10 లక్షల మంది ప్రజలు విపత్తు కారమంగా ఆకలిని అనుభవించారు. మే నాటికి కరవు బాధితుల సంఖ్య 300,000కు చేరే ప్రమాదం ఉంది.

Hunger is the weapon: ఆకలే ఆయుధం
Hunger is the weapon: ఆకలే ఆయుధం
  • అడవి గడ్డి, కలుపు మొక్కలే ఆహారం..

అధికారిక గణాంకాల ప్రకారం, మిలిటెంట్లు దాదాపు 250 మందిని బందీలుగా చేసుకున్నారు. వీరిలో 130 మంది గాజాలో ఉన్నారని ఇజ్రాయెల్‌ విశ్వసించింది. వీరిలో 33 మంది చనిపోయారని భావించారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, హమాస్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడిలో 31,800 మందికి పైగా మరణించారు, వారిలో ఎక్కువ మంది మహళలు, పిల్లలే. ఐరాస మానవహక్కుల ప్రతినిధి జెన్స్‌ లార్కే, గాజా కరువును ప్రకటించడానికి కఠినమైన ప్రమాణాలను సూచించారు.

కరువు పరిమితులు ఇప్పటికే ఉత్తర గాజాలో తాండవిస్తున్నాయి. ప్రజలు పక్షిగుడ్లు, జంతువుల మేత, అడవి గడ్డి, కలుపు మొక్కలను తింటున్నారు. మానవతా సహాయాన్ని అనుమతించకుంటే, త్వరలో రోజుకు 200 కంటే ఎక్కువ మంది ఆకలితో చనిపోయే ప్రమాదముందని లార్కే హెచ్చరించారు.

డేంజర్‌ బెల్స్‌

పౌరుల ఆరోగ్యం గణనీయంగా కృశించిపోతోంది. తక్కువ జనన బరువు కారణంగా నవజాత శిశువులు చనిపోతున్నారు. ఇంకొందరు ఆకలితో చిన్నారులు మరణం అంచుకు చేరారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ చెప్పారు. యుద్ధానికి ముందు గాజాలో పోషకాహార లోపం లేదు. ప్రస్తుత సంక్షోభం పూర్తిగా మానవ తప్పిదం. మహూన్నత అవసరాలను తీర్చడానికి అవసరమైన సహాయాన్ని తీసుకురావడానికి సురక్షితమైన ప్రాప్యత లేకపోవడాన్ని ఆమె ఖండించారు.

ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రతి ఒక్కరూ, ఆకలిని అంతం చేయడానికి ముందుకురావాలి. అవసరమైన మానవతా సహాయం, వాణిజ్య వస్తువుల పంపిణీని సులభతరం చేయడానికి ఇజ్రాయెల్‌పై ఒత్తిడితేవాలి. కాల్పుల విరమణ, అలాగే గాజాలో ఇప్పటికీ ఉన్న ఇజ్రాయెలీ బందీలను బేషరతుగా విడుదలకు తక్షణ చర్యలు చేపట్టాలి అని మార్గరెట్‌ హారిస్‌ సూచించారు. అయితే ఈ ప్రకటనను జెనీవాలోని ఇజ్రాయెల్‌ దౌత్యమిషన్‌ కొట్టిపారేసింది. మమ్నల్ని నిందించడం మానుకోవాలి. ఇజ్రాయెల్‌ యుద్ధం చేస్తోంది పాలస్తీనా ప్రజలతో కాదు.. #హమాస్‌తో అని నొక్కి చెప్పింది.

పాక్‌ ప్రథమ మహిళగా ఆసిఫా భుట్టో

పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ ఆలీ జర్దారీ తన చిన్న కుమార్తె ఆసిఫాను పాక్‌ ప్రథమ మహిళగా ప్రకటించారు.సాధారణంగా దేశాధ్యక్షుని భార్య ప్రథమ మహిళగా పరిగణింపబడతారు.అయితే,జర్దారీ సతీమణి మాజీ ప్రధాని బెనెజీర్‌ భుట్టో 2007లో హత్యకు గురైన నాటి నుంచి మళ్ళీ పెళ్ళి చేసుకోకపోవడంతో ఆ పదవిని ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ప్రథమ మహిళ పదవిని భర్తీ చేసేందుకు చట్టాన్ని మార్చారు.

జర్దారీ కుమార్తె ఆసీఫా గత ఏడాది నవంబర్‌లో ముల్తాన్‌లో జరిగిన బహిరంగ సభలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె ఎడిన్‌బరో వర్శిటీలోనూ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలోనూ విద్యాభ్యాసం చేశారు. ఆమె ఇటీవల జరిగిన పాక్‌ ఎన్నికల్లో తన సోదరుడు బిలావల్‌ భుట్టో తరఫున ప్రచారం చేశారు. సింధ్‌ప్రావిన్సులోని ఎన్‌ఎ 207 స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉందని పీపుల్స్‌ పార్టీ వర్గాలు తెలియజేశాయి. పాకిస్తాన్‌ చరిత్రలో దేశాధ్యక్షుని కుమార్తె ప్రథమ మహిళ కావడం ఇదే ప్రథమం.

రష్యాలో రాయబారిగా వినయ్‌ కుమార్‌

ప్రస్తుతం మయన్మార్‌కు భారత రాయబారిగా వ్యవ#హరిస్తున్న వినయ్‌ కుమార్‌ రష్యాకు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినయ్‌ కుమార్‌ త్వరలో నూతన బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు. భారత విదేశాంగ విధానంలో భారత్‌-రష్యా సంబంధాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వ్లాదిమర్‌ పుతిన్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.

రష్యన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన వ్లాదిమర్‌ పుతిన్‌కు ఎక్స్‌ వేదికగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారత్‌ర్ఖష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా మీతో కలిసిపనిచేసేందుకు వేచిచూస్తున్నామని ప్రధాని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తదుపరి రాయబారిగా వినయ్‌ కుమార్‌ నియామకం వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు.

పవార్‌ పార్టీకి ట్రంపెట్‌ గుర్తు: సుప్రీం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శరద్‌పవార్‌ వర్గం పార్టీపేరు, ఎన్నికల చిహ్నం విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. లోక్‌సభ, అసెంబ్లిd ఎన్నికలలో ఎన్‌సీపీ-శరద్‌చంద్ర పవార్‌ అనే పార్టీ పేరును, బాకా ఊదుతోన్న వ్యక్తి (ట్రంపెట్‌) గుర్తును ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పేరు, చిహ్నాన్ని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

ఆ గుర్తును ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని సూచించింది. అజిత్‌ పవార్‌ వర్గాన్నే అసలైన ఎన్‌సీపీగా గుర్తించిన ఎన్నికల కమిషన్‌, ఆపార్టీ జెండా, ఎన్నికల గుర్తు (గడియారం)ను కూడా వారికే కేటాయించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసిన శరద్‌పవార్‌ వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రత్యర్థి వర్గాన్ని గడియారం గుర్తును వాడకుంటా నిలువరించాలని కోరింది.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో గడియారం గుర్తు వాడకంపై అజిత్‌ వర్గానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, న్యాయ నిర్ణయానికి లోబడే దాన్ని వినియోగిస్తున్నట్లు వార్తా పత్రికలలో పబ్లిక్‌ నోటీసు జారీ చేయాలని సూచించింది.

తీహార్‌ జైలులో మరిన్ని జామర్లు

ఖైదీల ఆగడాలకు కళ్లెం వేసేలా తీహార్‌ జైలులో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నియంత్రించేందుకు మరిన్ని మొబైల్‌ జామర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా ఆరు చోట్ల 15 జామర్లు పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫోన్లు, బేస్‌ టవర్ల మధ్య సిగ్నల్‌ ప్రసారాలు నిలిపివేసే ఈ జామర్లను రూ.11.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు.

దీనివల్ల జైలు లోపల ఇకపై 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లు పనిచేయవు. ఇప్పటికే కాల్‌ బ్లాకింగ్‌ కోసం టవర్స్‌ ఆఫ్‌ హార్మోనియస్‌ కాల్‌ బ్లాకింగ్‌ వ్యవస్థ ఉండగా, దీనికి ఈ 15 జామర్లు అదనమని అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరు నాటికి వీటి ఏర్పాటు పూర్తవుతుందని తీహార్‌ జైలు డీజీ సంజయ్‌ బానీవాల్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ జైలులో 19వేల మంది ఖైదీలున్నారు.