- తమిళనాడు అధికారపార్టీపై ప్రధాని మోడీ విమర్శలు
- హిందూమతాన్ని, మహిళల్ని అవమానిస్తున్నారు
- రాహుల్ శక్తి వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్
- ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదని హెచ్చరిక
DMK 5G: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తమిళనాడులో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సేలం జిల్లాలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థిపార్టీలైన డీఎంకే, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. డీఎంకే, కాంగ్రెస్‌లు ఒకే నాణానికి రెండు ముఖాలు. డీఎంకే – కాంగ్రెస్ అంటే పెద్ద అవినీతి.. కుటుంబపాలన. ఈ దేశం కాంగ్రెస్‌ను గద్దె దించిన తర్వాత 5జీ టెక్నాలజీని అందిపుచ్చుకుంది. కానీ తమిళనాడులో డీఎంకే సొంతంగా 5జీని నడుపుతోంది.
ఇక్కడ 5జీ అంటే ఒక కుటుంబానికి చెందిన ఐదవ తరం అని ప్రధాని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో డీఎంకే ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలిసిందే. ఇది డీఎంకే అసలు స్వరూపం అని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రా#హుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యపై ప్రధాని మోడీ భారత కూటమిపై దాడిని కొనసాగించారు. ప్రతిపక్ష కూటమి శక్తిని నాశనం చేయాలని ప్రకటించడం ద్వారా వారి మనసులోని దుష్టభావనను ప్రదర్శించింది. కాంగ్రెస్, డిఎంకెలు కీలక భాగస్వామ్యమైన ప్రతిపక్ష కూటమి పదే పదే హందూమతాన్ని అవమానిస్తున్నాయి.
ఈ దేశ మహిళల్ని అవమానిస్తున్నాయి. మహళా శక్తిని ప్రస్తావిస్తూ #హందూమతంలో శక్తి అంటే ”మాతా శక్తి, నారీ శక్తి” అని అన్నారు. శక్తి అనేది దైవాన్ని సూచిస్తుంది. రాష్ట్రంలోని మారియమ్మన్, మదురై మీనాక్షియమ్మన్, కంచి కామాక్షియమ్మ వంటి వివిధ దేవతల రూపంలో ఈ శక్తి వ్యక్తమవుతుంది. జాతీయ కవి సుబ్రమణ్య భారతమాతను ‘శక్తి’గా ఆరాధిస్తారు. శక్తిని నాశనం చేయాలని మాట్లాడేవారిని తమిళనాడు శిక్షిస్తుంది. నేను శక్తి ఉపాసకుడిని అని మోడీ అన్నారు.
దివంగత నేత రమేశ్‌కు నివాళి
పదేళ్ల కిందట సేలం జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నాయకుడు రమేశ్‌ను గుర్తుచేసుకుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. దాంతో కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపాల్సివచ్చింది. అనంతరం మాట్లాడుతూ, ఆడిటర్ రమేశ్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ప్రస్తుతం ఆయన మనతోలేరు. ఆయనొక గొప్ప వ్యక్తి. రేయింబవళ్లు పార్టీకోసం ఎంతగానో కష్టపడి పనిచేశారు. అలాంటి వ్యక్తి హత్యకు గురయ్యారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటు.
సభాముఖంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను అని అన్నారు. రమేశ్ గతంలో తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2013 జులైలో ఆయన్ను ఇంటిలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. అలాగే మరొక బీజేపీ నాయకుడు కేఎన్ లక్ష్మణన్‌ను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.
రోడ్‌షోపై ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
కోయంబత్తూరులో ప్రధాని రోడ్‌షోలో పాఠశాల విద్యార్థులను బలవంతంగా పాల్గొనేలా చేశారన్న వార్తల నేపథ్యంలో కోయంబత్తూరు జిల్లా విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి విచారణ చేపట్టారు. పిల్లలతో పాటు వచ్చిన ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయిబాబా విద్యాలయం ఎయిడెడ్ మిడిల్ స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఈ ఘటనపై సవివరమైన నివేదికను సమర్పించాలని కూడా కోరారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో సందర్భంగా, సాయిబాబా కాలనీ జంక్షన్లో సుమారు 50 మంది ఎయిడెడ్ పాఠశాలకు చెందిన పిల్లలు ఆయన రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పిల్లలు సాయంత్రం దాకా రోడ్డు పక్కనే వేచి ఉన్నారు. కొందరు #హందూ దేవతల వలె దుస్తులు ధరించారు.
ఈ సంఘటన రాజకీయ ప్రచారంలో పిల్లల భాగస్వామ్యాన్ని నిషేధించిన ఈసీ నిబంధనల్ని ఉల్లంఘించేదిగా ఉందన్నది ఫిర్యాదు సారాంశం. టిఎంసి రాజ్యసభ ఎంపి సాకేత్ గోఖలే తన సోషల్ మీడియా హ్యాండిల్లో స్కూల్ పిల్లల ఫోటోను షేర్ చేశారు. ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీజేపీతో పీఎంకే పొత్తు ఖరారు
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోనున్నట్టు పిఎంకె అధ్యక్షుడు ఎస్ రామదాస్ ప్రకటించిన మరునాడే మంగళవారం ఇరు పార్టీల నాయకులు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. రామదాస్ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో పిీఎంకేకు బీజేపీ పది సీట్లు కేటాయించింది. ఆ సీట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎస్ అన్నామలై తెలిపారు. పీఎంకేకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా? అన్న ప్రశ్నకు అన్బుమణి రామదాసు సమాధానం దాటవేశారు.
ద్రవిడ పార్టీల వైఖరిపై అన్బుమణి తీవ్రంగా విరుచుకుప డ్డారు. రాష్ట్రంలో 60 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంటున్న ఉభయ డీఎంకేలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.ప్రజలు మార్పు కోరుతున్నారని ఆయన చెప్పారు. అయితే, దశాబ్దాలుగా పీఎంకే ఉభయ డిఎంకెలలో ఏదో దానితో పొత్తు కొనసాగిస్తూ వచ్చింది.
బీజేపీలోకి సీతా సోరెన్, తరన్‌జిత్
లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార భారతీయ జనతాపార్టీలోకి చేరికలు జోరుగా జరుగుతు న్నాయి. తాజాగా జార్ఖండ్‌లో జేఎంఎం ముఖ్యనేత, మాజీసీఎం వదిన అయిన సీతా సోరెన్, అమెరికాకు భారతీయ అంబాసిడర్‌గా పనిచేసిన పంజాబ్‌కు చెందిన మాజీ బ్యూరోక్రాట్ తరన్‌జిత్ సింగ్ సంధూ కాషాయ పార్టీలో చేరారు. జార్ఖండ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హేమంత్ సోరెన్ జైలుకెళ్లిన నేపథ్యంలో, ఆ పార్టీకి మరోషాక్ తగిలింది. శిబూ సోరెన్ పెద్దకోడలు సీతా సోరెన్ జేఎంఎంకు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 14 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా తనకు గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, #హూంమంత్రి అమిత్ షాలపై నమ్మకంతో బీజేపీలో చేరుతున్నానని అన్నారు. కాగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ భర్త దుర్గా సోరెన్ 2009లో మరణించారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరుచేసే విధంగా వ్యవహరించడం తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు.
కాలంతోపాటు పరిస్ధితులు మారతయాని తాను సహనంతో ఉన్నప్పటికీ తన భర్త విడిచిపెట్టిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ చొరవ చూపడం లేదని ఆరోపించారు. ఇక తరన్‌జిత్ సింగ్ సంధూ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి పోటీచేస్తారని తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తవడే, తరుణ్‌చుగ్ సమక్షంలో సంధూ కాషాయపార్టీలో చేరారు. అమెరికా, భారత్ మధ్య బంధం బలోపేతం అయ్యిందని సంధూ తెలిపారు. తన రాజకీయ ఇన్నింగ్స్‌కు అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, #హూంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.