Encounter in Gadchiroli: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతం లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకు న్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన నలు గురు మావోయిస్టు అగ్రనేత లు మృతి చెందినట్టు తెలి సింది.. వారిని డీవీసీ సభ్యు లు వర్గీష్, మంగాతు, ప్లా టూన్ సభ్యులు కురుసం రాజు, వెంకటేశ్‌గా గుర్తించారు.
ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. మృతు ల్లో ఇద్దరిపై పోలీసులు శాఖ గతంలో భారీ రివార్డు ప్రక టించింది.
వారిపై రూ.36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు.