The country wants change: దేశం మార్పును కోరుతోంది

  • సీడబ్ల్యూసీ మీటింగ్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే
  • ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాపై చర్చ

The country wants change:లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తర్వాత తొలిసారి మంగళవారం ఢిల్లిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో, వ్యూహాలు, ప్రచారసరళి, కార్యాచరణ వంటి కీలక అంశాలపై పార్టీ పెద్దలు విపులంగా చర్చించారు. ఈ సమావేశానికి ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రా#హుల్‌ గాంధీ హాజరయ్యారు. అంబికా సోనీ, ప్రియాంక గాంధీ వాద్రా, పి చిదంబరం, దిగ్విజయ సింగ్‌, అజయ్‌ మాకెన్‌, కుమారి సెల్జాతో సహా ఇతర సీనియర్‌ నేతలు కూడా కీలక సమావేశంలో పాల్గొన్నారు.

ఇక్కడ పార్టీ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలను చిదంబరం చదివి వినిపించారు. ఆమోదం కోసం ముసాయిదా పత్రం కాపీని పార్టీ సీడబ్ల్యూసీకి సమర్పించింది. ఆమోదం తర్వాత ముసాయిదా మేనిఫెస్టోకు తుది రూపాన్ని ఇస్తుంది. ఈ ముసాయిదా ఇదు రకాల భాగిదారీ, కిసాన్‌, నారీ, శ్రామిక్‌, యువన్యాయ్‌)—న్యాయాల అమలుకోసం 25 గ్యారంటీలను కలిగివుంది. ప్రతి న్యాయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రా#హుల్‌ గాంధీ ఇదివరకే ప్రకటించారు.

The country wants change: దేశం మార్పును కోరుతోంది
The country wants change: దేశం మార్పును కోరుతోంది

ఈ భేటీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం చెబుతున్న హామీలు 2004 నాటి ‘భారత్‌ వెలిగిపోతోంది’ నినాదానికి సమానమైన విధిని ఎదుర్కొంటాయని చెప్పారు. ఇప్పుడు దేశం మార్పును కోరుకుంటోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే డిమాండ్‌ అన్ని వైపులనుంచీ బలంగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్న హామీలకు 2004 నాటి ఎన్డీయే నినాదమైన ‘ఇండియా షైనింగ్‌’ గతే పడుతుంది అని ఖర్గే నొక్కిచెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పార్టీ మేనిఫెస్టోపై చర్చించి ఆమోదించేందుకు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కోరారు. మన మేనిఫెస్టోకు వివిధ రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం లభించేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

అలాగే మన సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేసేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు కర్తవ్యదీక్షతో నిర్వహించాలి. మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని కచ్చితంగా అమలుచేసి తీరతాం. మేనిఫెస్టోలో వాగ్దానాలు పొందుపరిచే ముందు, అమలు చేయడం గురించి కూడా లోతుగా చర్చించడం జరిగింది. 1926 నుండి నేటికీ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో అంటే విశ్వాసం, నిబద్ధతకు సంబంధించిన పత్రంగా పరిగణించ బడుతుంది అని ఖర్గే వివరించారు.

రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రను కూడా ఖర్గే ప్రశంసించారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలపై దేశం దృష్టిని ఆకర్షించగలిగిందని అన్నారు. ఇవి కేవలం రాజకీయ యాత్రలు మాత్రమే కాదు. మన రాజకీయ చరిత్రలో అతిపెద్ద ప్రజా సంప్రదింపు ఉద్యమంగా గుర్తించబడతాయి. మన కాలంలో ఎవరూ ఇంత భారీ కసరత్తు చేయలేదనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఈ రెండు యాత్రలు కూడా ప్రజల సమస్యను ఎలుగెత్తగలిగాయి అని అన్నారు.

సీఏఏపై స్టేకు సుప్రీం నో

దేశంలో ఇటీవల అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం-2019పై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వివాదాస్పద చట్టం అమలును నిలిపివేయాలని, దీనిపై స్టే ఆర్డర్‌ ఇవ్వాలన్న అభ్యర్థనలను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అమలులోకి వచ్చిన చట్టాన్ని తక్షణమే నిలుపుదల చేయడానికి సిద్ధంగా లేమని చెప్పింది. అయితే, ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌ 9వ తేదీన చేపడతామని సుప్రీం తెలిపింది.

సీఏఏపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంలో 236 పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఇటీవల ఆ చట్టానికి చెందిన రూల్స్‌ను నోటిఫై చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కూడా ఆయా పిటీషన్లలో సవాల్‌ చేశారు. ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. సీఏఏను సవాల్‌ చేస్తూ ఇండియన్‌ ముస్లిం లీగ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తున్నారు. 1995 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 2ను సవరించారు. అఎn్గాన్‌, బంగ్లా, పాక్‌లో మతపరమైన వేధింపులకు గురవుతున్న వారిని రక్షించాలన్న ఉద్దేశంతో ఆ సవరణ రూపొందించారు.

ఎన్డీయేకి ఆల్‌ఎల్‌జేపీ గుడ్‌బై

కేంద్ర మంత్రి పశుపతి పరాస్‌ మంగళవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ బయటకి వచ్చినట్లు ప్రకటించారు. చిరాగ్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీతో బీజేపీ సీట్ల పొత్తు ఒప్పందమే పరాస్‌ అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. ఎన్డీయే నుంచి మా పార్టీ పూర్తిగా పక్కకు తప్పుకుంది. నా పార్టీకి, నాకు అన్యాయం జరిగింది. అందుకే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను.

రాష్ట్ర స్థాయి కాంగ్రెస్‌-రాష్ట్రీయ జనతాదళ్‌ కూటమితో లేదా కాంగ్రెస్‌ నేతృత్వంలోని జాతీయ స్థాయి ఇండియా కూటమితో ప్రతిపక్షంతో సంప్రదింపుల కోసం పరాస్‌ ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్‌ స్థానంలో తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన ఇప్పటికే స్పష్టంచేశారు. పరాస్‌ ఐదేళ్ల క్రితం అప్పటి అవిభక్త లోక్‌ జనశక్తి పార్టీ సభ్యునిగా హాజీపూర్‌లో గెలిచారు. పార్టీ వ్యవస్థాపకుడు, చిరాగ్‌ పాశ్వాన్‌ తండ్రి అయిన కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ దీనికి నాయకత్వం వహంచారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు ముందు, గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే కేతన్‌ ఇనామ్‌దార్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆత్మగౌరవం కంటే ఏదీ ఎక్కువ కాదని, ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో వడోదర స్థానంలో పార్టీ అభ్యర్థి రంజన్‌ భట్‌ విజయానికి కృషి చేస్తానని ఇనామ్‌దార్‌ అన్నారు. వడోదర జిల్లాలోని సావ్లి స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన శాసనసభ స్పీకర్‌ శంకర్‌ చౌదరికి మంగళవారం రాజీనామా లేఖను సమర్పించారు.

మనోభీష్టం మేరకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. గతంలో కూడా 2020 జనవరిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, దానిని స్పీకర్‌ ఆమోదించలేదు. మంగళవారం తన రాజీనామాను సమర్పించిన తర్వాత ఇనామ్‌దార్‌ విలేకరులతో మాట్లాడుతూ, ఇది ఒత్తిడి వ్యూహం కాదని అన్నారు. ”చాలా కాలంగా, చిన్న, వృద్ధ కార్మికులను పార్టీ పట్టించుకోవడం లేదని నేను భావించాను. ఈ విషయాన్ని నేను నాయకత్వానికి తెలియజేశాను అని చెప్పారు.11 సంవత్సరాలకు పైగా సావ్లిd నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నట్లు చెప్పాడు.