Delhi is the pollution capital: ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లి మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్‌లోని బెగుసరాయి నిలిచింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌కు చెందిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ (డబ్ల్యుఎక్యు) తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా అత్యల్ప వాయు నాణ్యత కలిగిన దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉన్నది. ఆ జాబితాలో 134 దేశాల నివేదికను వెల్లడించారు. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఇండియా బంగ్లాదేశ్, పాకిస్థాన్ తర్వాత ఉన్నట్లు పేర్కొన్నది.
2022లో పీఎం 2.5 కాన్‌సెంట్రేషన్ ఉన్న దేశాల్లో ఇండియా 8వ స్థానంలో ఉండేది. అతి కలుషిత మెట్రోపాలిటన్‌గా బెగుసరాయి తొలి స్థానంలో ఉన్నది. అక్కడ పీఎం 2.5 స్థాయి 118.9 మైక్రోగ్రామ్స్‌గా ఉన్నది. ఢిల్లిdలో పీఎం 2.5 స్థానం రెండేళ్ల క్రితం 89.1 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్‌గా ఉన్నది. ఇక 2023లో ఆ రేంజ్ 92.7 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్‌గా మారింది. మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఢిల్లి నిలవడం ఇది వరుసగా నాలుగవసారి. కాగా, ఈ విధమైన కాలుష్య రాజధానులు, నగరాల జాబితాలో 2018 నుంచి మన హస్తినాపురి టాప్‌లో ఉంటోంది.
- క్యూబిక్ మీటరుకు సగటున 54.4 మైక్రోగ్రాముల వార్షిక పిఎం 2.5 గాఢతతో ఢిల్లి టాప్ ప్లేస్‌లో నిలవగా, తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్ (క్యూబిక్ మీటరుకు 79.9 మైక్రోగ్రాములు), పాకిస్తాన్ (73.7 మైక్రోగ్రాములు) ఉన్నాయి.
- ఢిల్లిలో పీఎం 2.5 స్థాయిలు 2022లో క్యూబిక్ మీటరుకు 89.1 మైక్రోగ్రాముల నుంచి 2023లో క్యూబిక్ మీటరుకు 92.7 మైక్రోగ్రాములకు దిగజారాయని నివేదిక పేర్కొంది.
- 2018లో ఢిల్లి నాలుగు సార్లు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా నిలిచింది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ##హచ్‌ఓ) సిఫార్సు చేసిన వార్షిక మార్గదర్శక స్థాయి క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా భారతదేశంలోని 1.36 బిలియన్ల మంది పిఎం 2.5 సాంద్రతలను అనుభవిస్తున్నారని అంచనా వేయబడింది.
- అలాగే, 1.33 బిలియన్ల మంది, భారత జనాభాలో 96 శాతం మంది, వార్షిక పిఎం 2.5 మార్గదర్శకం కంటే ఏడు రెట్లు ఎక్కువ పిఎం 2.5 స్థాయిలను అనుభవిస్తున్నారు.
- దేశంలోని 66 శాతం కంటే ఎక్కువ నగరాలు వార్షిక సగటు క్యూబిక్ మీటరుకు 35 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నాయి.
- 2022 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 131 దేశాలు, ప్రాంతాలు, భూభాగాల్లోని 7,323 స్థానాల నుండి డేటాను కలిగి ఉంది. 2023లో, ఆ సంఖ్యలు 134 దేశాలు, భూభాగాల్లోని 7,812 స్థానాలకు పెరిగాయి.
- ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మరణాలలో ఒకటి వాయు కాలుష్యం మూలంగానే సంభవిస్తోంది.
- ఐరాస ప్రకారం, ఏటా ప్రపంచవ్యాప్తంగా 70లక్షల అకాల మరణాలకు వాయు కాలుష్యమే కారణం.
- పిఎం 2.5 వాయు కాలుష్యానికి గురికావడం వల్ల ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్ మరియు ఊపిరితిత్తుల వ్యాధులతో సహా అనేక ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది.
లోక్‌సభ ఎన్నికలలో
71వేల మంది డిపాజిట్లు గల్లంతు
ఎన్నికలలో పోటీ చేయడం ఓ సవాల్. పేరు ప్రఖ్యాతులతోపాటు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా. ఓటమి కూడా గెలుపులాగే ఉండాలని అందరూ కోరుకుంటారు. గట్టి పోటీ ఇచ్చాడు.. గెలిచి ఓడాడు..అని నలుగురూ అనుకునేలా పోటీ ఇవ్వాలని బరిలోకి దిగిన ప్రతి ఒక్కరూ కోరుకునే సంగతి. ఎన్నికల పోటీలో గౌరవానికి కనిష్ట కొలమానం డిపాజిట్ దక్కించుకోవడం.
గెలిచిన అభ్యర్థికి పోలైన ఓట్లలో నిర్దిష్ట శాతం ఓట్లను పొందగలిగితే రాజకీయాల్లో పరువు నిలుపుకున్నట్లుగానే భావిస్తారు. ముందుగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే సదరు అభ్యర్థి నామినేషన్ పత్రం దాఖలు చేయాలి. దానితోపాటే సెక్యూరిటీ డిపాజిట్ (నగదు మొత్తం) కట్టాలి. ఇది సాధారణ మొత్తం కావడంతో చాలా మంది సరదాగా కూడా పోటీ చేస్తుంటారు. దేశవ్యాప్త ఎన్నికలైన లోక్‌సభ పోలింగ్‌లో ఇలాంటి వారి సంఖ్య భారీగానే ఉంటుంది.
వీరిలో చాలా మందికి డిపాజిట్ కూడా దక్కదు. భారతదేశ ఎన్నికల చరిత్రలో (లోక్‌సభ ఎన్నికలు) ఇలా డిపాజిట్లు కోల్పోయిన వారి సంఖ్య 71,000 మంది ఉన్నారంట. గెలిచిన అభ్యర్థిలో ఆరో వంతు ఓట్లు పడితేనే ఓడిన అభ్యర్థికి డిపాజిట్ వాపస్ ఇస్తారు. కానీ ఒకవేళ ఆరో వంత ఓట్లు పోలవ్వకుంటే, ఆ అభ్యర్థి డిపాజిట్ గల్లంతైనట్టే. లోక్‌సభ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, జాతీయ పార్టీలకు చెందిన నేతలు తమ డిపాజిట్‌ను ఎక్కువ శాతం దక్కించుకోగలిగారని ఏడీఆర్ ట్రస్టీ సభ్యుడు జగదీప్ చోకర్ తెలిపారు.
- 2019 ఎన్నికల్లో సుమారు 85 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రాకుంటే ఆ అభ్యర్థి డిపాజిట్ డిపాజిట్ అమౌంట్‌ను ప్రభుత్వ ట్రెజరీకి మళ్లిస్తారు.
- ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తొలి లోక్‌సభ ఎన్నికల నుంచి 91,160 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. దాంట్లో 71,246 మంది తమ సెక్యూర్టీ డిపాజిట్‌ను కోల్పోయారు. ఆ సంఖ్య 78 శాతం ఉన్నట్లు ఈసీ డేటా ద్వారా తెలుస్తోంది.
- 1951లో జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 సెక్యూర్టీ డిపాజిట్ ఉండేది. ప్రస్తుతం ఈ మొత్తాన్ని 25 వేలు, రూ.12,500కు పెంచారు.
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు అత్యధికంగా డిపాజిట్లు కోల్పోయారు. 383 మంది అభ్యర్థుల్లో 345 మందికి డిపాజిట్ దక్కలేదు. ఏడీఆర్ జాబితాలో కాంగ్రెస్ పార్టీ తరపు 421 మంది పోటీ చేయగా, దాంట్లో 148 మందికి డిపాజిట్ రాలేదు.
- 1951-52 లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం మంది డిపాజిట్ కోల్పోయారు. 1874 మంది అభ్యర్థులు పోటీపడితే దాంట్లో 745 మందికి డిపాజిట్ దక్కలేదు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ విధమైన పరిస్థితి కొంత వరకు మారింది.
- 1996లో జరిగిన 11వ లోక్‌సభ ఎన్నికల్లో 13952 మంది అభ్యర్థులు పోటీపడగా, దాంట్లో 12,688 మందికి డిపాజిట్ రాలేదు.