Anusha Shetty : తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అభిమానులు ఈమెను స్వీటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించిన స్వీటీ 40 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. అయితే గతంలో స్వీటీ పై పలు రకాల రూమర్స్ వచ్చినప్పటికి అవి ఏమీ కూడా నిజం కాలేదు.
అయితే తాజాగా మరోసారి ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం స్వీటీ ఓ క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.. అయితే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే రెండు సన్నివేశాలు మూడు పాటలు బాడీ షో చేస్తే సరిపోదు సినిమా మొత్తాన్ని భుజాలపై ఎత్తుకొని ఒంటి చేత్తో నడిపించగల సత్తా కూడా ఉండాలి. అయితే అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీలో ఆ సత్తా నిరూపించి చూపించింది.
మొదట్లో ఈమె కూడా అందాలను బాగానే ఆరబోసినప్పటికీ ఆ తర్వాత జేజమ్మ , రుద్రమదేవి, దేవసేన , భాగమతి వంటి పాత్ర లతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విధంగా ఆమె భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మరి ముఖ్యంగా డైరెక్టర్లకు నిర్మాతలకు లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే అనుష్క పేరు గుర్తిచ్చేలా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.