రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (ఎస్‌వోఈ/సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 8వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు సంబంధించి (గురుకులం) నోటిఫికేషన్ విడుదల చేశారు. గిరిజన బాలబాలికలకు మాత్రమే ఈ గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు మార్చి 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఎంపి-కై-న విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తారు. అలాగే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇంటర్ ఎంపీసీలో 300 సీట్లు-, బైపీసీలో 300 సీట్లు-, 8వ తరగతిలో 180 సీట్లు- అందుబాటు-లో ఉంచారు. ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 05న మెరిట్ జాబితా వెల్లడిస్తారు. మే 20న మొదటి దశ, మే 25న రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.