ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు- పాలి-టె-క్నిక్‌లలో ప్రవేశం కోసం ”పాలిసెట్‌-2024” ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 27న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సాంకేతికి విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి రూపొందించిన సమాచార కరదీపిక, కరపత్రాలు, గోడ పత్రికలను సోమవారం సాంకేతిక విద్యా శాఖ కేంద్ర కార్యాలయంలో నాగరాణి ఆవిష్కరించారు. ఈ ప్రచార కరదీపికలో పాలి-టె-క్నిక్‌ విద్యతో కలిగే ప్రయోజనాలు, పాలి-టె-క్నిక్‌ విద్య పూర్తి చేసిన విద్యార్ధులు పొందుతున్న ఉపాధి అవకాశాలు, జీత భత్యాల వివరాలను సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, పాలిసెట్‌-2024 ప్రవేశ పరిక్ష గురించి విద్యార్ధులకు మెరుగైన అవగాహన కల్పించే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు- పాఠశాలలలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నామన్నారు. పదవ తరగతి పరిక్షలు పూర్తయిన వెంటనే ప్రభుత్వ పాలి-టె-క్నిక్‌ కళాశాలలో ఉచితంగా ”పాలిసెట్‌-2024” ప్రవేశ పరీక్ష కు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈ కోచింగ్‌ ఇంగ్లీష్‌, తెలుగు మీడియం లో ఇవ్వడమే కాకుండా, ప్రవేశ పరీక్ష కొరకు రూపొందించబడిన స్టడీ మెటీ-రియల్‌ కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నామన్నారు. ఎన్‌బిఎ గుర్తింపు పొందిన ప్రభుత్వ పాలి-టె-క్నిక్‌ లతో ఈ విద్యా సంవత్సరము (2024-25) నుండి విద్యార్ధులకు మెరుగైన విద్యనందిచుటకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంసిద్దంగా ఉందన్నారు.