హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం శాఖల వారిగా అధికారులతో సమీక్షించారు. రేపటి నుండి నాలుగు రోజుల పాటు- అగ్రంపహాడ్ జాతర పనులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. జాతరకు పెద్దసంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఏర్పాటు- చేసిన స్నాన ఘట్టాలను, పబ్లిక్ టాయిలెట్స్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా వెహికల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్లు- చేయాల్సిందిగా పోలీస్ శాఖను సూచించారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక పూర్తి చేసిన పనులను వివిధ శాఖలతో సమీక్షించారు. రెడ్ క్రాస్ హనుమకొండ ఆధ్వర్యంలో జాతరలో ఏర్పాటు- చేసిన వైద్య శిబిరాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన అధికారులకు వారు చేయవలసిన డ్యూటీ- పనులను నిర్వర్తించడంలో పలు సూచనలు చేశారు. రాబోయే నాలుగు రోజులు చాలా జాగ్రతగా విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకార్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిషోర్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఆత్మకూరు సిఐ సంతోష్, ఈవో శేషగిరి, పంచాయతీరాజ్ డిఇ లింగారెడ్డి, ఎస్ఆర్ఎస్పి డిఈ వేణుగోపాల్, ఎలక్ట్రిస్రిటీ- ఏఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సతీష్, ఏపీవో రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.