మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొంటు-న్న సమయంలో జ్వరం బారిన పడి, తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ, రోజువారి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటూ, అవసరమైన సూచనలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కోలుకొని, మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారు.