మేడారంలో పోటెత్తిన భక్తజనం

ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బుధవారం రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకురానున్న నేపథ్యంలో… అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పో-టె-త్తారు. అమ్మవార్లకు తులాభరంతో బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదే విధంగా వడిబియ్యం, చీర, సారెతో పూజలు నిర్వహించారు. భక్తులు పూనకాలతో పరవశిస్తు అమ్మవార్ల దీవెనల కోసం గద్దెల వద్దకు చేరుకుంటు-న్నారు. మేడారం జనసందోహంతో ఆధ్యాత్మిక భక్తి భావనతో పులకించిపోతోంది.