రాష్ట్రంలో 110 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న డిఎస్పిలతో పాటు జంట నగరాలలో దాదాపు 34మంది ఏసీపీలను బదిలీ చేశారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున ఐపీఎస్, డిఎస్పిల బదీలీలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా బదిలీ అయిన 110 మంది డిఎస్పి స్థాయి అధికారులు నిర్థేశించిన సమయంలో విధులలో చేరాలని డిజిపి ఉత్తర్వులలో పేర్కొన్నారు.