33 మంది చిన్నారులను రక్షించిన రైల్వే పోలీసులు

రాష్ట్రంలో ఆపరేషన్‌ స్మైల్‌లో భాగంగా రైల్వే పోలీసులు, స్వచ్చంద సంస్థలు కలసి 34 మంది పిల్లలను రక్షించారని సికిందరాబాద్‌ రైల్వే ఎస్‌పి షేక్‌సలీమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు- చేశామన్నారు. ఈక్రమంలో సికింద్రాబాద్‌ అర్బన్‌, సికింద్రాబాద్‌ రూరల్‌, కాజీపేట సబ్‌డివిజన్‌లలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌లతో పాటు పలు సొసైటీ- ఆర్గనైజేషన్‌ సభ్యులు రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్ల నుండి మొత్తం 34 మంది పిల్లలను సంరక్షించారని వివరించారు. వీరిలో 19 మంది బాలురు, 15 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. వీరిలో కొందరిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని, మిగిలిన వారిని పిల్లల సంరక్షణ గృహాలకు అప్పగించామన్నారు.