Director Maruthi : తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ట్రూ లవర్ అనే సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మారుతి ,మూవీ డైరెక్టర్ ప్రభు ,అలాగే హీరో హీరోయిన్స్ కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మారుతి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ముందుగా సినిమా గురించి మాట్లాడిన ఆయన ట్రూ లవర్ గురించి తెలియజేశారు. ఇద్దరు ట్రూ లవర్స్ వారిద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ని సిచువేషన్ ని ఎలా ఫేస్ చేసి ముందుకెళ్లారు లైఫ్ లో అనే విషయాలు గురించి సినిమా ఉంటుందని తెలియజేశారు. అలాంటి వారందరికీ ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ అని తెలియజేశారు.
అలాగే ట్రూ లవర్స్ అందరూ కచ్చితంగా ఈ సినిమా చూడాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మొదటి పది నిమిషాలు చూస్తే చాలు 2 గంటలు కూడా తెలియకుండా సాగిపోతుందని ఆయన అన్నారు. సినిమా పూర్తయ్యే సమయానికి ఇంకా ఏదో ఉంటే బాగుండు ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ తో బయటికి వస్తారని ఆయన తెలిపారు.