- దేశంలో మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా
- 543 సీట్లు.. 7 దశలు.. 82 రోజులు
- షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్
- తక్షణమే కోడ్ అమలులోకి.. రాజకీయ పార్టీలు అలర్ట్
Election bell: దేశంలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లిdలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. చివరి దశ జూన్1 జరుగుతుంది. శనివారం మధ్యా#హ్నం 3 గంటలకు భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు.
లోక్‌సభకు తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, చివరిదైన ఏడోదశ జూన్ 1న జరుగుతాయి. జూన్ 4న లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ అసెంబ్లిd ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. తెలుగు రాష్ట్రాలకు ఈసారి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగవ విడతలో భాగంగా, మే 13న తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాలు, 175 అసెంబ్లిd స్థనాలకు ఒకేవిడత పోలింగ్ జరగనుంది.
543 లోక్‌సభ స్థానాల్లో 84 ఎస్సీ రిజర్వ్‌డ్, 412 జనరల్, 47 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రతి వెయ్యి మంది పురుషులకు 948 మంది మ#హళా ఓటర్లు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మ#హళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనున్నది. పార్లమెంట్, అసెంబ్లిd ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు చేసే ఖర్చుకు సంబంధించి ఎన్నికల కమిషన్ వ్యయ పరిమితిని విధించింది.
ఇందుకు సంబంధించిన వివరాలు రెండు రకాలుగా ఉన్నాయి. అరుణాచల్, గోవా, సిక్కింలలో పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా రూ.75 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని అలాగే, అసెంబ్లిd బరిలోకి దిగే వ్యక్తులు గరిష్టంగా రూ.28 లక్షల వరకు ఖర్చుపెట్టవచ్చని ఈసీఐ స్పష్టంచేసింది. ఈ మూడు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని వరుసగా (లోక్‌సభ, అసెంబ్లిd) రూ.95 లక్షలు, రూ 40 లక్షలుగా పేర్కొది.
- అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, డామన్ డయ్యూ, ఢిల్లి, గోవా, గుజరాత్, హమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్షద్వీప్, లడఖ్, మిజోరం, మేఘలాయ, నాగలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్‌లలో ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
- కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్‌లలో రెండు దశల్లో, ఛత్తీస్‌గఢ్, అసోం రాష్ట్రాల్లో మూడు దశల్లో.. ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో ఐదు దశల్లో, మహారాష్ట్ర, జమ్ము-కాశ్మీర్‌లలో ఆరు దశల్లో, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చి బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో పోలింగ్ నిర్వ#హంచనున్నారు.
- సార్వత్రిక ఎన్నికలతోపాటే మొత్తం 26 అసెంబ్లిd స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 97 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో 1.82 లక్షల మంది కొత్త ఓటర్లు. లోక్‌సభ ఎన్నికల నిర్వ#హణ కోసం 12 లక్షల పోలింగ్ స్టేషన్‌లు, 55 లక్షల ఈవీఎంలు, 1.5 కోట్ల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.
- 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు #హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నారు. ఇందులో 40 శాతం మంది దివ్యాంగులు. శతాధిక ఓటర్లు 2.18 లక్షల మంది ఉన్నారు.
- మొత్తం ఓటర్లు – 96.8కోట్లు
- పురుషులు – 49.7 కోట్లు
- మహిళలు 47.1 కోట్లు
- ట్రాన్స్‌జెండర్లు – 48,000
- 85 పైబడినవారు- 82 లక్షలు
- 20-29 మధ్య వయస్కులు – 19.74 కోట్లు
- 18-19 మధ్య వయస్కులు – 1.8 కోట్లు
- 55 లక్షల ఈవీఎంలు
- 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు
- 1.5 కోట్ల మంది పోలింగ్, భద్రత సిబ్బంది
7 దశల్లో ఎన్నికలు
దశలు.. స్థానాలు పోలింగ్ తేదీ
ఫేజ్-1 102 19-04-2024
ఫేజ్-2 89 26-04-2024
ఫేజ్-3 94 07-05-2024
ఫేజ్-4 96 13-05-2024
ఫేజ్-5 49 20-05-2024
ఫేజ్-6 57 25-05-2024
ఫేజ్-7 57 01-06-2024
ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి 04-06-2024
మొదటి దశ – 19 ఏప్రిల్ (21 రాష్ట్రాలు/యూటీ-102 స్థానాలు)
అరుణాచల్ ప్రదేశ్ (2), అసోం (5), బీహార్ (4), ఛత్తీస్‌గఢ్ (1), మధ్యప్రదేశ్ (6), మహారాష్ట్ర (5), మణిపూర్ (2), మేఘాలయ (2) మిజోరం (1), నాగాలాండ్ (1), రాజస్థాన్ (12), సిక్కిం (1), తమిళనాడు (39), త్రిపుర (1), ఉత్తరప్రదేశ్ (8), ఉత్తరాఖండ్ (5), పశ్చిమబెంగాల్ (3), అండమాన్ నికోబార్ (1), జమ్ము-కాశ్మీర్ (1), లక్షద్వీప్ (1), పుదుచ్చేరి (1)
రెండవ దశ – 26 ఏప్రిల్ – (13 రాష్ట్రాలు/యూటీ- 89 స్థానాలు)
అసోం (5), బీహార్ (5), ఛత్తీస్‌గఢ్ (3), కర్ణాటక (14), కేరళ (20), మధ్యప్రదేశ్ (7), మహారాష్ట్ర (8), మణిపూర్ (1), రాజస్థాన్ (13), త్రిపుర (1), ఉత్తరప్రదేశ్ (8), పశ్చిమబెంగాల్ (3), జమ్ము-కాశ్మీర్ (1).
మూడవ దశ – 7 మే (12 రాష్ట్రాలు/యూటీ, 94 స్థానాలు)
అసోం (4), బీహార్ (5), ఛత్తీస్‌గఢ్ (7), గోవా (2), గుజరాత్ (26), కర్ణాటక (14), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), యూపీ (10), పశ్చిమ బెంగాల్ (4), దాద్రానగర్ హవేలీ (2), జమ్ము-కాశ్మీర్ (1)
నాల్గవ దశ – 13 మే (10 రాష్ట్రాలు/యూటీ, 96 స్థానాలు)
ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్ము-కాశ్మీర్ (1)
ఐదవ దశ- 20 మే (8రాష్ట్రాలు/యూటీ, 49 స్థానాలు)
బీహార్ (5), జార్ఖండ్ (3), మహారాష్ట్ర (13), ఒడిశా (5), యూపీ (14), పశ్చిమ బెంగాల్ (7), జమ్ము-కాశ్మీర్ (1), లడఖ్ (1)
ఆరవ దశ – 25 మే (7రాష్ట్రాలు – 57 స్థానాలు)
బీహార్ (8), హర్యానా (10), జార్ఖండ్ (4), ఒడిశా (6), యూపీ (14), పశ్చిమ బెంగాల్ (8), ఢిల్లిd (7).
ఏడో దశ – 1 జూన్ (8 రాష్ట్రాలు-57 స్థానాలు)
బీహార్ (8), హిమాచల్ ప్రదేశ్ (4), జార్ఖండ్ (3), ఒడిశా (6), పంజాబ్ (13), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (9), చండీగఢ్ (1)
నాలుగు రాష్ట్రాల అసెంబ్లిలకూ..
పార్లమెంట్ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లిd ఎన్నికలు కూడా ఇదే షెడ్యూల్‌లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో లోక్‌సభతోపాటే అసెంబ్లిd ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఏప్రిల్ 19న ఒకే విడతలో రెండు ఎన్నికలు జరుగుతాయి. అరుణాచల్‌లో 60 అసెంబ్లిd, 2 లోక్‌సభ స్థానాలు, సిక్కింలో 32 అసెంబ్లిd స్థానాలు ఉన్నాయి.
147 అసెంబ్లిd స్థానాలున్న ఒడిశాలో రెండు దశల్లో (మే 25, జూన్1) ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లిd స్థానాలతోపాటు 25 ఎంపీ స్థానాలకు మే 13న ఒకే దశలో ఓటింగ్ జరుగనున్నది. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు 26 అసెంబ్లిd నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి.
బీహార్‌లో అజియాన్(ఎస్సీ) నియోజకవర్గానికి, గుజరాత్‌లో విజపూర్, కాంభత్, వఘోడియా, మనవదర్, పోర్‌బందర్, #హర్యానాలో కర్నాల్, జార్ఖండ్‌లో గాండేయ్, మహారాష్ట్రలో అలోక్ వెస్ట్, త్రిపురలో రామ్‌నగర్, ఉత్తరప్రదేశ్‌లో దద్రౌల్, లక్నోఈస్ట్, గెయిన్‌సరి, దుద్ది, పశ్చిమబెంగాల్‌లో భగవాన్‌గోలా, బారానగర్, తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, హమాచల్‌ప్రదేశ్‌లో ధర్మశాల, లా#హౌల్, సుజన్‌పూర్, బర్‌సర్, గాగ్రెట్, ఖుతేల్#హర్, రాజస్థాన్‌లో బగిడోరా, కర్ణాటకలో సోరపూర్, తమిళనాడులో విలవన్‌కోడే నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
జమ్ము-కాశ్మీర్‌లో..
జమ్ము-కాశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై ఈసీఐ భిన్నమైన వైఖరి తీసుకుంది. మిగతా రాష్ట్రాలకు విరుద్ధంగా, ఇక్కడ లోక్‌సభ, అసెంబ్లి ఎన్నికల్ని వేర్వేరుగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఏకకాలంలో నిర్వహించడం లేదని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతన్నది. ఆరేళ్లుగా అసెంబ్లిdకి ఎన్నికలు జరగలేదు. తొలుత దేశవ్యాప్త షెడ్యూల్‌లో భాగంగానే ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తాం.
అదీకూడా ఐదు దశలలో. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు అసెంబ్లిd ఎన్నికలు పూర్తిచేస్తాం అని తెలిపారు. జమ్ము-కాశ్మీర్‌లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ము-కాశ్మీర్‌లో 5 ఎంపీ స్థానాలు, లడఖ్‌లో ఒక ఎంపీ స్థానం ఉన్నాయి.