Owaisi : యోగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం రోజున (మార్చి 2) నల్గొండ ఆర్యసమాజ్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాందేవ్ బాబా.. ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై, ఒవైసీ పూర్వీకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ పూర్వీకులు కూడా రుషుల సంతానమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒత్తిళ్లు, ఇతర అవసరాల కోసం వాళ్లు ఇస్లాం మతంలోకి మారి ఉండొచ్చంటూ అభిప్రాయపడ్డారు. మదర్సాలకు, చర్చీలకు విదేశాల నుంచి వందల కోట్ల ఫండ్స్ వస్తున్నాయి కానీ.. సనాతన ధర్మ కోసం అదానీ, అంబానీ వంటి వాళ్లు ఎలాంటి ఫండ్స్ ఇవ్వడం లేదని రాందేవ్ బాబా అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మదర్సాలు, మిషనరీలను గురుకులాలుగా మార్చాలని రాందేవ్ బాబా డిమాండ్ చేశారు. బాబర్, ఔరంగజేబు వారసులం అని చెప్పుకునే వాళ్లు ఈ దేశ పౌరులు కానే కాదంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ దేశంలో ఉండే వాళ్లంతా రుషిరుషుల పరంపర అని.. ఒవైసీ పూర్వీకులు కూడా రుషులే అని వివరించారు. చిన్న ఖురాన్, చిన్న బైబిల్ చదవడం కోసం మదర్సాలు, మిషనరీలు ఏర్పాటు చేశారని.. అవే మత మార్పిడులకు కారణం అవుతున్నాయన్నారు. పతంజలి సంస్థ.. సనాతన ధర్మం కోసమే ఏర్పాటయ్యిందని స్పష్టం చేసిన రాందేవ్ బాబా.. మరో 5 సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
స్పానిష్ మహిళపై 10 మంది గ్యాంగ్‌రేప్
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. స్పెయిన్ దేశం నుంచి భారత పర్యటనకు వచ్చిన మహిళపై 10 మంది దుండగులు అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. మహిళ భర్త ఉండగానే.. అతని కళ్ల ముందే ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తర్వాత బాధిత మహిళ భర్తతో కలిసి పోలీస్ స్టే్షన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత జరిగిన ఘటనపై భార్యాభర్తలు ఇద్దరు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
స్పెయిన్‌కు చెందిన భార్యాభర్తలు.. విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగానే జార్ఖండ్‌లోని దుమ్కాకు శుక్రవారం చేరుకున్నారు. అక్కడ బైక్‌పై పర్యటిస్తున్న వారిద్దరు.. చీకటి కావడంతో కుంజి గ్రామం సమీపంలో ఎవరూ లేని ప్రాంతంలో టెంట్ వేసుకుని నిద్రించారు. అది గమనించిన కొందరు దుండగులు ఆ స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆ టెంట్‌లోకి దూరి ఆ విదేశీ మహిళపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆమె భర్త ఉండగానే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. చుట్టుపక్కల జనాలు లేకపోవడంతో సహాయం కోసం ఎంత అరిచినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత వారిద్దరూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటన గురించి వివరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న చంపై సోరెన్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు దుమ్కా ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు సోషల్ మీడియా వేదిగా తన ఆవేదనను వెల్లబోసుకుంది.