Rahul vs BJP on Shakti: శక్తిపై రాహుల్‌ వర్సెస్‌ బీజేపీ

Rahul vs BJP on Shakti: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ‘శక్తి’ వ్యాఖ్యలపై బీజేపీ ముఖ్యనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై ఎదురుదాడికి దిగారు. భాజపా నేత షెహజాద్‌ పూనావాలా మాట్లాడుతూ, ”శివాజీ పార్క్‌ వద్ద ఉద్ధవ్‌ థాకరే ముందు రాహుల్‌ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. #హందూ ధర్మానికి శక్తి అని ఏదో ఉంది. మేము ఆ శక్తితో పోరాడుతున్నాము అని. ఈ వ్యాఖ్యలు హిందూమతంపై కాంగ్రెస్‌, ఇండియా కూటమికి ఉన్న హద్దులేని ద్వేషం అని విమర్శించారు.

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్‌ పిలుపు నిచ్చిన సంగతి మనందరికీ తెలుసని అన్నారు. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా రాహుల్‌ను లక్ష్యంగా చేసుకు న్నారు. మరొకరిని ద్వేషించే విషయంలోనూ ఒక పరిమితి ఉండాలని హితవు పలికారు. మోడీపై రాహుల్‌కు తీవ్రమైన ద్వేషం, దురహంకారం అన్ని హద్దులను దాటింది. కాంగ్రెస్‌ నాయకుడి వ్యాఖ్యలపై నాకెలాంటి ఆశ్చర్యం కలగలేదు అని బీజేపీ బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్‌ అన్నారు.

Rahul vs BJP on Shakti: శక్తిపై రాహుల్‌ వర్సెస్‌ బీజేపీ
Rahul vs BJP on Shakti: శక్తిపై రాహుల్‌ వర్సెస్‌ బీజేపీ

కాగా శక్తి అనేది మహిళా శక్తితో ప్రతిధ్వనిస్తుంది. శక్తి అనే పదానికి దుర్గాదేవి, కాళీమాత ప్రతిరూపాలు. సోనియా జీతో సహా ప్రతి స్త్రీకి ఉన్న అంతర్గత బలమే శక్తి. ఈ విషయాలను రాహుల్‌ గాంధీకి ఎవరైనా గుర్తుచేస్తే మంచిది అంటూ బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వియా ఎక్స్‌లో పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ #హందుద్వేషి మాత్రమే కాదు, స్త్రీ ద్వేషి కూడా. ఇది కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి నిజస్వరూపం అని పేర్కొన్నారు. ఇది బీజేపీతో లేదా (ప్రధాని) నరేంద్ర మోడీతో పోరాటం కాదని, వారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు.

  • నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: రాహుల్‌

తాను చేసిన శక్తి వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ వక్రీకరించారని కాంగ్రెస్‌ నేత రా#హుల్‌ గాంధీ స్పష్టం చేశారు. నా మాటలు మోడీకి నచ్చవు. వాటిని వక్రీకరిస్తూ ఏదోవిధంగా పెడార్థాలు తీసే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే నా మాటలు గంభీరంగా ఉంటాయి. అవి వాస్తవికమైనవి కూడా. ఆ విషయాలు ప్రధానికి తెలుసు. నేను పేర్కొన్న శక్తి అనే పదం మోడీ వేసుకున్న ముసుగు గురించి మాత్రమే. దానిపైనే నేను పోరాడుతున్నాను. సీబీఐ, ఈడీ, ఈసీ, మీడియాతోపాటు అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేసే శక్తి వారికుంది.

కొన్నివేల రూపాయల రుణాలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మోడీ మాత్రం తన మిత్రులకు వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాలను మాఫీ చేస్తున్నారు అంటూ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాగా, అంతకు ముందు తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ రా#హుల్‌ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. ఎవరైనా శక్తి వినాశనాన్ని కోరుతారా? అని ప్రశ్నించారు. చంద్రయాన్‌ విజయాన్ని కూడా శక్తిగా గుర్తించామని, ల్యాండర్‌ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టామని ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు.

  • మోడీ ప్రభత్వంలో అసుర శక్తి: దిగ్విజయ సింగ్‌

రాహుల్‌గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నలకు దిగ్విజయ్‌ తనదైన శైలిలో బదులిచ్చారు. శక్తులు రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి అసుర శక్తి. మరొకటి దైవ శక్తి అని చెప్పారు. అసుర శక్తి అంటే అవినీతి, #హంస.. అసుర శక్తి ఎప్పుడూ ప్రజలను వేధింపులకు గురిచేస్తుంటుంది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో ఉన్నది అసుర శక్తి. దైవశక్తి ఎప్పుడూ న్యాయాన్ని కోరుకుంటుంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. రా#హుల్‌ గాంధీ అంతం చేస్తామని చెప్పిన శక్తి ‘అసుర శక్తి’ అని డిగ్గీరాజా వివరణ ఇచ్చారు. ఆయన దైవశక్తి ద్వారా న్యాయాన్ని గెలిపించాలని భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.

  • కాంగ్రెస్‌లోకి సదానంద గౌడ!

సార్వత్రిక ఎన్నికల వేళ భారతీయ జనతాపార్టీ వ్యూహాలకు దీటుగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లిd ఎన్నికల్లో విజయం సాధించిన హస్తంపార్టీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్‌నేత, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఆ పార్టీని వీడనున్నారని ప్రచారం జరుగుతోంది.

బెంగళూరు నార్త్‌ టిక్కెట్‌ దక్కకపోవడంపై ఆయన నిరాశతో ఉన్నారని, బహుశా కాంగ్రెస్‌లో చేరొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై స్పందిన సదానంద గౌడ తదుపరి రాజకీయ కార్యాచరణపై మంగళవారం అధికారిక ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తన బర్త్‌డే సందర్భంగా మద్దతుదారులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న భాజాపను వీడనున్నట్లు స్పష్టంచేశారు.

  • బీహార్‌లో ఎన్డీయే డీల్‌ ఓకే

బీహార్‌లో ఎన్డిdఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై స్పష్టత వచ్చింది. ముందుగా ఊహించినట్లుగానే బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్‌జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. హందుస్తానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్‌ మోర్చా పార్టీలు ఒక్కొక్క సీటు నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్‌ తవడే తెలిపారు. చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీకి హాజీపూర్‌, వైశాలి, సమస్తిపూర్‌, ఖాగరియా, జామై స్థానాల్ని కేటాయించారు.

పశుపతి కుమార్‌ పరాస్‌కు చెందిన ఆర్‌ఎల్‌జేఎంకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఒప్పందం ప్రకారం తూర్పు చంపారన్‌, పశ్చిమ చంపారన్‌, ఔరంగాబాద్‌, మధుబని, అరారియా, దర్బాంగ, ముజఫర్‌పూర్‌, మహారాజ్‌గంజ్‌, సరన్‌, ఉజియార్పూర్‌, బెగుసరాయ్‌, నవాడ, పాట్నాసాహిబ్‌, పాటలీపుత్ర, అరా, బక్సర్‌, ససరమ్‌ నియోజకవర్గాలలో బీజేపీ పోటీ చేస్తుంది. ఆర్‌ఎల్‌ఎంకు కరాకట్‌, హెచ్‌ఏఎమ్‌కు గయ సీట్లను ఇచ్చారు. గయ నుంచి మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ మాంరి&ు పోటీ చేయనున్నారు.

  • తమిళనాట గవర్నర్‌ వర్సెస్‌ సీఎం

తమిళనాడులో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకెస్టాలిన్‌ల మధ్య తిరిగి సరికొత్త వివాదం తలెత్తింది.మాజీ మంత్రి కె.పొన్ముడిని తిరిగి మంత్రిగా ప్రమాణం చేయించేందుకు గవర్నర్‌ రవి తిరస్కరించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈనెల 13వ తేదీన గవర్నర్‌కి లేఖ రాయగా, ఆయన స్పందించకుండా 14న ఢిల్లిdకి వెళ్ళారు.

తిరిగి వచ్చిన తర్వాత కూడా గవర్నర్‌ రవి పొన్ముడి చేత ప్రమాణం చేయించేందుకు నిరాకరించారు. పొన్ముడి శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేయలేదనీ, సస్పెండ్‌ చేసింది కనుక, సాంకేతికంగా ఆయనచేత మంత్రిగా ప్రమాణం చేయించేందుకు వీలు లేదని గవర్నర్‌ చెప్పినట్టు తెలుస్తోంది.ఇది గవర్నర్‌ చేస్తున్న అన్వయింపనీ,పొన్ముడి కేసు సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారమైనట్టేనని,డిఎంకె ఎంపీ పి.విల్సన్‌ వాదిస్తున్నారు.రాజ్యాంగం పట్ల గవర్నర్‌ రవి ఏమాత్రం గౌరవం లేదని ఆయన విమర్శించారు.

కాగా,ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే,2023 డిసెంబర్‌లో మద్రాసు హైకోర్టు పొన్ముడి,ఆయన భార్య,మరొకరికి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మూడేళ్ళ జైలు శిక్ష విధించింది.ఈ శిక్షను సుప్రీంకోర్టు సస్పెండ్‌ చేసింది.ఈ కేసు పూర్వపు అన్నాడిఎంకె కాలం నాటిదనీ, రాజకీయ కక్షతోనే పొన్ముడిపై కేసు పెట్టారని డిఎంకె వాదిస్తోంది.పొన్ముడి దంపతులకు 1.4కోట్ల విలువైన ఆస్తున్నాయనీ, ఆదాయానికి మించి ఆస్తులున్నాయని పూర్వపు ప్రభుత్వ హయాంలో కేసు పెట్టారు.