Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఆయన భాషలో ఏ మాత్రం తేడా రాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన మాటలు సౌమ్యంగా లేవని, దూకుడుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి భాష పై కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
సీఎం హోదాలో ఉన్నప్పుడు మాట్లాడే భాష సరైనదిగా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి భాష సౌమ్యంగా లేకుండా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం చేజిక్కించుకోవడం కోసం దురుసుగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా మాట్లాడడం సరైనది కాదు అని అంటున్నారు.
కొందరు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పరిపక్వత చెందలేదని అంటున్నారు. సీఎం అయిన తర్వాత మొదటి ప్రసంగంలో రేవంత్ రెడ్డి స్పీచ్ బాగానే ఇచ్చారు. దాని గురించి అందరూ మాట్లాడుకున్నారు కూడా. అయితే రెండు నెలల పాలన తర్వాత రేవంత్ రెడ్డి భాష తీరు మారింది.