JanaSena – TDP : తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు సమాచారం. తాజాగా ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు నివాసంలో మూడు గంటల పాటు సమావేశమైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఒక అవగాహన వచ్చినట్లు భోగట్టా.
ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిసిన తర్వాత సీట్ల పంపకం గురించి రెండు పార్టీలు ప్రకటన చేసే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ కనీసం జనసేన నుంచి 60 సీట్లు కోరుతున్నారని ప్రచారం తనపైకి వచ్చింది. ఆ తర్వాత 40 సీట్లకు ఒప్పందం కుదిరిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.