Vidathala Rajini : నియోజకవర్గాల ఇన్చార్జి మార్పును వైయస్ జగన్మోహన్ రెడ్డి, వరుస పెట్టి చేస్తూ ఉండడం, వరుసగా జాబితాలను విడుదల చేస్తూ ఉండడం, ఒకటి కాదు రెండు కాదు దాదాపు 65 మంది ఎమ్మెల్యేలను మార్చడం , దాదాపు పదిమంది ఎంపీలను పార్టీ నుండి తొలగించడం ఏదైతే ఉందో దీనిలోంచి అసంతృప్తులు పుట్టుకొస్తున్నాయని చెప్పాలి.
అయితే పార్టీ లో ఇలాంటివి పుట్టుకు రావడం అనేది చాలా సహజం. అయితే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు , ఎంపీలు రాజీనామా చేశారు, కొంతమంది జనసేన టిడిపిలకు వెళ్తుంటే మరికొందరు రాజకీయాలకే దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒకటే అనిపిస్తుంది. ఓటు పడితే తనని చూసి ఓటు పడాలి లేకపోతే ఓటు పడకూడదు.
మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మెన్స్ ఎమ్మెల్యేగాని ఎంపీలు గాని ఎవరు మధ్యలో ఉండకూడదు అనుకుంటున్నట్లు గా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత వ్యతిరేకమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు అనేవారు మన తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి మనల్ని రిప్రజెంట్ చేయడానికి మన తరపున మాట్లాడుతాడు.