రానున్న సార్వత్రికి ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ అన్ని విధాల సిద్ధమవుతోంది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఔత్సాహికుల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వెల్లువెత్తుతోంది. దీంతో అభ్యర్ధుల దరఖాస్తుల స్వీకరణ కోసం ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించిన అధిష్టానం తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ-కి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చైర్ పర్సన్‌గా వ్యవహరించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిటీలో సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, పళ్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్, చింతా మోహన్, తులసి రెడ్డి, జేడీ శీలం సహా మొత్తం 20 మంది సీనియర్లకు చోటు- దక్కింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా ముందుకెళ్తున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. పార్టీ క్యాడర్ లో జోష్ కనపడుతోంది. ప్రత్యేక హోదా అంశం, విభజన చట్టం హామీలు వంటి కీలక అంశాలను షర్మిల పదే పదే ప్రస్తావిస్తున్నారు.