It is the participation of the people Beauty of democracy: ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అందం: మోడీ

Modi: గత దశాబ్ద కాలంలో దేశంలోని పేదలు, రైతులు, యువత, మహళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో క్సషి చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని పౌరులందరినీ ఉద్దేశించి రాసిన ‘బ#హరంగలేఖ’లో, కేంద్రప్రభుత్వ వికసిత్‌ భారత్‌ ఎజెండా రూపకల్పనకు సూచనలను కోరారు. అలాగే మీరు నాపై ఉంచిన నమ్మకం వల్లే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా పక్కా గృహాలు, అందరికీ విద్యుత్‌, నీరు, ఎల్‌పీజీ సౌకర్యం, ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఉచిత వైద్యం, రైతులకు ఆర్థిక సహాయం, మాత వందన యోజన ద్వారా మహళలకు సహాయం, మరెన్నో ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని లేఖలో పేర్కొన్నారు.

ఈ దశాబ్దకాలంలో మనదేశం తరువాతి తరం మౌలిక సదుపాయాలకు అపూర్వమైన నిర్మాణం, మన గొప్ప జాతీయ, సాంస్కృతిక వారసత్వ పునరుజ్జీవనం రెండింటినీ చూసిందని మోడీ అన్నారు. పార్లమెంట్‌లో మ#హళల భాగస్వామ్యాన్ని పెంపొందించే ప్రయత్నాలు, జిఎస్‌టి అమలు, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌పై కొత్త చట్టం, నారీ శక్తి వందన్‌ వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకోగలగడానికి కారణం మీ విశ్వాసం, మద్దతు అని అన్నారు. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం, తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన చర్యలకు మీ విశ్వాసమే ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని చెప్పారు.

It is the participation of the people Beauty of democracy: ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అందం: మోడీ
It is the participation of the people Beauty of democracy: ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అందం: మోడీ

ప్రజాస్వామ్యం యొక్క అందం జనభాగిదారి లేదా ప్రజా భాగస్వామ్యంలో ఉంది. దేశ సంక్షేమం కోసం సా#హసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆకాంక్షించే ప్రణాళికలను రూపొందించడానికి, వాటిని సజావుగా అమలు చేయడానికి మీ మద్దతు నాకు అపారమైన శక్తిని ఇస్తుంది. నేను మీ ఆలోచనల కోసం ఎదురు చూస్తున్నాను. వికసిత్‌ భారత్‌ను నిర్మించాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి సూచనలు, మద్దతు కోరుతున్నాను. మనందరం కలిసి మన దేశాన్ని గొప్ప ఎత్తులకు తీసుకెళ్తామని విశ్వసిస్తున్నాను అని మోడీ చెప్పారు.

అదేవిధంగా, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనను ప్రస్తావిస్తూ, అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలైంది. 2024 ఎన్నికల తేదీలను ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. మిగిన బీజేపీతోపాటు ఎన్డీయే పార్టీలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయి. సుపరిపాలనలో మా ట్రాక్‌రికార్డు ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం. పదేళ్ల కిందట ఈ దేశ ప్రజలు మోసానికి గురమయ్యామనే భావనలో ఉన్నారు. కుంభకోణాలు జరగని రంగంలేదు. ప్రపంచం మనవైపు చూడటం మానేసింది. అక్కడి నుంచి అద్భుతమైన మలుపు తిరిగింది. ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల సహకారంతో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోంది.

ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచాం. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దూరదృష్టి కలిగిన ప్రభుత్వం ఏం చేయగలదో భారత ప్రజలు గమనించారు. అందుకే ఈసారి 400 స్థానాలు అని ప్రజలు నినదిస్తున్నారు. మన దేశంలోని విపక్షానికి ఒక లక్ష్యం, విధానం లేదు. వారికి నిందించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. వారి వారసత్వ, విద్వేష రాజకీయాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు. అవినీతి వారిని దెబ్బతీసింది. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదని మోడీ చెప్పుకొచ్చారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ రాజీనామా

లోక్‌సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీకి షాక్‌ తగిలింది. భారతీయ జనతాపార్టీ రాజ్యసభ సభ్యుడు అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. జేపీ నడ్డాకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శర్మకు రాజీనామా లేఖలు పంపించాడు. బీజేపీ అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ను 2018లో మార్చి రాజ్యసభకు నామినేట్‌ చేసింది.

భాజపాలోకి బాలీవుడ్‌ సింగర్‌

బాలీవుడ్‌ గాయని అనురాధ పౌడ్వాల్‌ భారతీయ జనతాపార్టీలో చేరారు. శనివారం ఢిల్లిdలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె కాషాయపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సనాతన ధర్మంతో అనుబంధం కలిగిన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. బీజేపీలో చేరడం తన అదృష్టమని తెలిపారు. పార్టీ అప్పగించే ఎలాంటి బాధ్యతల్నైనా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని అన్నారు. 1954లో కర్ణాటకలోని కార్వార్‌లో జన్మించిన అనురాధ 1973లో అమితాబ్‌, జయప్రద నటించిన అభిమాన్‌ చిత్రంతో సంగీత ప్రపంచంలోకి ప్రవేశించారు.

పలు చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. ఐదు దశాబ్దాలపాటు సాగిన కెరీర్‌లో గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఒరియా, అస్సామీ, పంజాబ్‌, భోజ్‌పురి, నేపాలీ భాషలతో సహా 9000పాటలు పాడారు. 1500కిపైగా భజనలను స్వరపరిచారు. 2016లో అనురాధ సూర్యోదయ్‌ ఫౌండేషన్‌ను స్థాపించిన ఆమె, పేదలకు వైద్య సహాయం చేస్తూ వచ్చారు. 2011లో తన సేవలకు మదర్‌థెరీసా పురస్కారం, 2017లో పద్మశ్రీ అవార్డులు సొంతం చేసుకున్నారు.

Kejriwal gets anticipatory bail: కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌

Kejriwal gets anticipatory bail: కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌
Kejriwal gets anticipatory bail: కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌

మద్యం పాలసీ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయనకు రౌెస్‌ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఎనిమిది సార్లు ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరు కాకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టు మెట్లెక్కింది. దీంతో రౌెస్‌ అవెన్యూ కోర్టు తమ ముందు హాజరు కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేజ్రీవాల్‌కు న్యాయస్థానం రూ.లక్ష పూచీకత్తు, రూ.15 వేల బాండ్‌ సమర్పించాలని స్పష్టం చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కోర్టు నుంచి వెళ్లిపోయారు.

కెనడాలో భారత సంతతి
కుటుంబం అనుమానాస్పద మృతి

కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ నెల 7న బ్రాంప్టన్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దంపతులిద్దరితోపాటు వారి కుమార్తె సజీవ ద#హనం అయ్యారు. మృతులను భారత సంతతికి చెందిన రాజీవ్‌ వరికూ (51), అతని భార్య శిల్ప (47), కుమార్తె మ##హక్‌ వరికూ (16)గా నిర్ధారించారు. మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సందేహం వ్యక్తంచేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని తాము భావించడం లేదని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.