రూ.250 కోట్లుపైనే శివబాలకృష్ణ బినామీ ఆస్తులు

ఏసీబీ సోదాలలో శివబాలకృష్ణకు చెందిన రూ.250 కోట్ల విలువైన అక్రమ ఆస్తులపై విచారణ కొనసాగుతోంది, ఈక్రమంలో శివ బాలకృష్ణ వెనుకున్న అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ పేరిట బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, 7 ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్టు- ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. వీటితో పాటు- కుటుంబ సభ్యుల పేరుతో 29 ప్లాట్లు- ఉన్నట్లు- విచారణలో తేలింది. మొత్తం 19 ఓపెన్‌ ప్లాట్లు-, 7 ఫ్లాట్లు-, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు- దర్యాప్తులో తేలింది. తెలంగాణతో పాటు- ఏపీలోని విశాఖపట్నంలో శివ బాలకృష్ణకు ప్లాట్లు- ఉన్నట్లు- విచారణలో తేలింది. పలు ఖరీదైన భూములకు శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌ బినామీగా ఉన్నట్లు విచారణలో తేలడంతో అతనిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ను సోమవారం నాడు నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. కాగా తనకు బెయిల్‌ మంజూరు చేయాలని శివబాలకృష్ణ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, కేసు విచారణ దశలో ఉన్నందున శివ బాలకృష్ణకు బెయిల్‌ మంజూరు చేయొద్దని ఏసీబీ కోరింది. కేసు విచారణలో ఉన్న ఈ తరుణంలో శివ బాలకృష్ణకు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో శివబాలకృష్ణకు సంబంధించిన చాలామంది బినామీ ఆస్తులను గుర్తించామని, ముఖ్యంగా ఆయన సోదరుడిని కూడా అరెస్ట్‌ చేశామని కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.